ఆర్య, హన్సిక, అంజలి, సంతానం, ప్రేంజీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘సెట్టై’ సినిమాని తెలుగులో ‘క్రేజీ’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఉగాది కానుకగా రేపు ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలను తెలియజేయడానికి తెలుగు వెర్షన్ నిర్మాత సురేష్ కొండేటి ఈ రోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ ‘ థమన్ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆడియో లాగానే సినిమా కూడా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది. ఈ సమ్మర్లో ఫుల్ గా ఎంజాయ్ చెయ్యదగిన లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ ‘క్రేజీ’. ఇది కాకుండా గత నాలుగు రోజులుగా హీరోయిన్ అంజలి విషయం హాట్ టాపిక్. షాపింగ్ మాల్ సినిమా నుంచి ఆ అమ్మాయి నాకు తెలుసు. ఆడియో ఫంక్షన్ కి పిలుద్దామని వెళ్ళినప్పుడు షూటింగ్లో బిజీగా ఉంది అందుకే రాలేకపోయింది. రిలీజ్ టైంలో ఆ అమ్మాయిని తీసుకొద్దాం అంటే ఇలా జరిగింది. కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉన్నా బయటకి రావాలని, వచ్చి ఆగిపోయిన సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలి. ప్రొడ్యూసర్స్ కి చాలా నష్టం జరుగుతోంది. మీకు ఏ సమస్య ఉన్నా ఫిల్మ్ చాంబర్ పరిష్కరిస్తుందని, అలాగే ఏ సమస్యా రాకుండా చూసుకుంటుందని ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు గారు మాటిచ్చారని’ అన్నాడు.
అంజలి సమస్యని పరిష్కరిస్తామన్న చిత్ర సీమ – సురేష్ కొండేటి
అంజలి సమస్యని పరిష్కరిస్తామన్న చిత్ర సీమ – సురేష్ కొండేటి
Published on Apr 10, 2013 3:00 PM IST
సంబంధిత సమాచారం
- ఇరుముడి: మూడవ రోజు కూడా భారీ కలెక్షన్స్ !
- బన్నీ ‘రాకా’ పై మరో క్రేజీ రూమర్ ?
- ‘స్పిరిట్’లో ఆ సీక్వెన్స్ హైలెట్ అట !
- ‘వారణాసి’లో మరో బాలీవుడ్ నటుడు ?
- మొదటి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్న కొరటాల ?
- బాలయ్య 111: పెద్ద కాంపిటీషన్ లోనే రాబోతున్నారా!?
- డే 3 మరింత భారీగా “ఇరుముడి”.. అసలు టెస్ట్ ఇప్పుడు నుంచే!
- సెప్టెంబర్ 4న ‘మా రాముడు అందరివాడు’ విడుదల
- తెలుగు స్టేట్స్ లో ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే.. ఇక్కడా ఇంపాక్ట్ చూపిస్తుందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ఇరుముడి – మంచి ఎమోషన్స్ తో సాగే ఫీల్ గుడ్ సినిమా
- మెగాస్టార్ బర్త్ డే ట్రీట్.. స్టైలిష్ ఎంట్రీ ఇచ్చిన ‘కాకా’..!
- మెగా టీ – రెక్స్.. సెన్సేషనల్ కాంబినేషన్ ఆగిపోలేదు!
- ‘ఇరుముడి’ నైజాం ఫస్డ్ డే కలెక్షన్స్.. మాస్ కమ్‌బ్యాక్‌తో రవితేజ ర్యాంపేజ్..!
- ‘ఇరుముడి’కి కలిసొచ్చిన ‘ప్యారడైజ్’ నిర్ణయం..!
- ‘కాకా’ ఓకే.. మరి చిరు లీక్ చేసిన ‘కదిరి’ ఏమిటి..?
- అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘టాక్సిక్’ సెన్సేషన్: బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా యష్ సినిమా
- ఇదెక్కడి మాస్.. రోజున్నరలో బ్రేకీవెన్ కొట్టేసిన ‘ఇరుముడి’.. రవితేజ రోరింగ్ కంబ్యాక్ ఇది


