తెలుగు సినిమా రంగానికి సంబంధించిన అన్ని శాఖలు ఈ నెల 30న మూతపడనున్నాయి. వైజాగ్ తుఫాన్ బాధితుల సహాయార్ధం ‘మేము సైతం’ నిర్వహిస్తున్న ఈవెంట్ దీనికి ప్రధానకారణం
హుదుద్ సృష్టించిన ప్రళయానికి ప్రతిగా తెలుగులో బడా స్టార్లు, డైరెక్టర్లు భారీ రీతిలో కార్యక్రమాలను నిర్వహించి దాతలను, టి.వి వీక్షకులను సంతోషపెట్టనున్నారు
టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు భారీ సంఖ్యలో విరాళాలు ఇవ్వడంతో పాటు ఈ కార్యక్రమంతో పోగైన డబ్బుని సైతం అక్కడి ప్రజలకు చేర్చుతామని తెలిపారు. ఆరోజున ప్రతీ ఒక్కరూ స్వచ్చందంగా శెలవుని పాటిస్తున్నారని తెలిపారు


