‘మేముసైతం’కి సన్నద్దమవుతున్న టాలీవుడ్

‘మేముసైతం’కి సన్నద్దమవుతున్న టాలీవుడ్

Published on Nov 19, 2014 4:00 PM IST

mimu-sitham
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లోని అన్ని డిపార్ట్ మెంట్స్ ఈ నెల 30వ తేదీన అన్ని పనులకు బ్రేక్ ఇచ్చి పూర్తిగా సెలవు తీసుకోనున్నారు. అలా అని సెలవు తీసుకొని ఇంట్లో కూర్చోవడం లేదు.. అందరూ కలిసి నవంబర్ 30న టాలీవుడ్ నిర్వహిస్తోన్న మేముసైతం ప్రోగ్రాం కి హాజరు కానున్నారు. హుదూద్ బాధితుల కోసం ఈ మేము సైతం ప్రోగ్రాంని నిర్వహిస్తున్నారు.

చిన్న హీరో నుంచి పెద్ద హీరో దాకా, చిన్న డైరెక్టర్ నుంచి స్టార్ డైరెక్టర్ దాకా, లాగే సినిమాకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ ఈ కార్యక్రమానికి హాజరు కానున్నాడు.ప్రస్తుతం ఈ ప్రోగ్రాం కోసం అందరూ సిద్దమవుతున్నారు. అంతే కాకుండా ప్రతి ఒక్క స్టార్ కూడా స్టేజ్ పై పలు కార్యక్రమాలతో ఆకట్టుకోనున్నారు. సుమారు 13 గంటలపాటు జరిగే ఈ టెలీథాన్ ప్రోగ్రాంని జెమిని టీవీలో లైవ్ ఇవ్వనున్నారు. త్వరలోనే స్టార్స్ అందరూ తమ పార్ట్స్ కి సంబందించిన రిహార్సల్స్ ని మొదలు పెట్టనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు