
తెలుగు సినిమా పరిశ్రమకి ఒక పిల్లర్ లా నిలబడిన లెజండ్రీ నిర్మాత డా. డి. రామానాయుడు. సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 5 దశాబ్దాలుగా సినిమాలు చేస్తున్న రామానాయుడు ఈ రోజు మధ్యాహ్నం స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలియగానే చిత్ర సీమ మొత్తం శోఖ సముద్రంలో మునిగిపోయారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న సమయం నుంచి ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ దగ్గుబాటి ఇంటికి చేరుకొని రామానాయుడు గారికి నివాళులర్పించారు. ప్రస్తుతం రామానాయుడు గారి మృతదేహాన్ని సురేష్ బాబు ఇంటి దగ్గర ఉంచారు.
రేపు ఉదయం ఆయన మృతదేహాన్ని తెలుగు ప్రజల సదర్శనార్ధం రామానాయుడు స్టూడియోస్ లో ఉంచనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఆయన అంతిమ యాత్రని జరపనున్నారు. ఈ సందర్భంగా రేపు తెలుగు చిత్ర సీమ సెలవు ప్రకటించింది. తెలుగు చిత్ర సీమ రేపు అన్ని పనులను మాసేసి వచ్చి రామానాయుడుకి నివాళులర్పించి, అంతిమయాత్రలో పాల్గొననున్నారు. అలాగే రామానాయుడు గారిని చివరిసారిగా చూడాలనుకునే వారు రేపు రామానాయుడు స్టూడియోస్ లో చూడవచ్చు.

