ప్రముఖ నిర్మాత తిరుమలకు పాదయాత్ర !

ప్రముఖ నిర్మాత తిరుమలకు పాదయాత్ర !

Published on Jan 18, 2026 4:09 PM IST

తెలుగు ప్రముఖ నిర్మాత మరియు నటుడు బండ్ల గణేశ్‌ తిరుమలకు పాదయాత్ర చేపట్టబోతున్నారు. వైకాపా హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు అరెస్టైన సమయంలో మొక్కుకున్న మొక్కును తీర్చుకుంటానని బండ్ల గణేశ్‌ తిరుమలకు పాదయాత్రను మొదలు పెట్టబోతున్నారట. ఈ విషయం పై బండ్ల గణేష్ క్లారిటీ ఇస్తూ.. ‘మన నాయకుడు, దేశం గర్వించే దార్శనికుడు చంద్రబాబుపై వేసిన అభాండాలు తొలగిపోవాలని.. జైలు నుంచి ఆయన బయటకు రావాలని సుప్రీంకోర్టు గడపపై నిలుచుని శ్రీవేంకటేశ్వరస్వామిని ప్రార్థించాను.’ అని బండ్ల గణేష్ తెలిపారు.

బండ్ల గణేష్ ఇంకా క్లారిటీ ఇస్తూ.. ‘నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర’ చేస్తానని మొక్కుకున్నాను. ప్రతి తెలుగువాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్లీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని సాధించుకున్నారు. ఇటీవలే కేసులన్నీ కొట్టేశారు. దీంతో నా మనసు కుదుటపడింది. నా కుటుంబం మొక్కు గుర్తు తెచ్చుకుంది. అందుకే అమ్మానాన్నల ఆశీర్వాదాలతో షాద్‌నగర్‌లోని మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభిస్తాను. ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి దర్శనం చేసుకుంటాను. ఇది రాజకీయ యాత్ర కాదు. ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామికి నా మొక్కుబడి చెల్లింపు’’ అని బండ్ల గణేశ్‌ తన పోస్ట్ లో తెలిపారు.

తాజా వార్తలు