ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు వీరే..!

filimfare
భారతీయ సినీ పరిశ్రమలో జాతీయ అవార్డుల తర్వాత ఆ స్థాయి పేరున్నది ఫిల్మ్‌ఫేర్ అవార్డులకే! హిందీ, తెలుగు, తమిళం, కన్నడం మళయాలం ఇలా ఒక్కో భాష సినిమాలకు విడివిడిగా ఈ అవార్డులను నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. 2014లో విడుదలైన హిందీ సినిమాలకు సంబంధించిన అవార్డులను కొన్ని నెలల క్రితమే ప్రకటించగా తాజాగా సౌతిండియా భాషల సినిమాలకు నిన్న సాయంత్రం ఈ అవార్డులను ప్రదానం చేశారు.

చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో సినీ తారల ఆట పాటల మధ్య సాగిన ఈ వేడుకలో అవార్డుల కోసం 2014లో విడుదలైన టాప్ సినిమాలు పోటీ పడ్డాయి. తెలుగు అవార్డుల విషయానికి వస్తే.. గత సంవత్సరం సంచలన విజయం సాధించిన ‘మనం’ సినిమా మొత్తం 5 క్యాటగిరీల్లో అవార్డులను సొంతం చేసుకొని టాప్ పొజిషన్‌లో నిలిచింది. ‘రేసు గుర్రం’ సినిమాతో తన స్థాయిని మరింత పెంచుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఉత్తమ నటుడుగా ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సినిమాటోగ్రఫర్ ఇలా 5 అవార్డులతో మనం సత్తా చాటింది. పూర్తి అవార్డుల వివరాలిలా ఉన్నాయి.

ఉత్తమ చిత్రం : మనం
ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (రేసు గుర్రం)
ఉత్తమ దర్శకుడు : విక్రమ్ కుమార్ (మనం)
ఉత్తమ నటి : శృతి హాసన్ (రేసు గుర్రం)
ఉత్తమ సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్ (మనం)
ఉత్తమ సహాయ నటుడు : జగపతి బాబు (లెజెండ్)
ఉత్తమ సహాయ నటి : మంచు లక్ష్మి (చందమామ కథలు)
ఉత్తమ గీత రచయిత : చంద్రబోస్ (‘కనిపెంచిన’.. మనం)
ఉత్తమ నేపథ్య గానం (మేల్) : సింహ ( సినిమా సూపిత్త మామ.. రేసు గుర్రం)
ఉత్తమ నేపథ్య గానం (ఫీమేల్) : సునీత (ఏం సందేహం లేదు.. ఊహలు గుసగుసలాడే)
ఉత్తమ ఛాయాగ్రహకుడు : పీ.ఎస్. వినోద్ (మనం)

Exit mobile version