సినిమాలే నా జీవితం కాదు – ప్రకాష్ రాజ్

PRAKASH_RAJ
దక్షిణ భారతదేశపు సినిమా రంగంలో రెండు దశాబ్దాల నుండి అలుపెరుగకుండా పని చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశాడు. “నా జీవితంలో సినిమాలది కేవలం ఐదు శాతం మాత్రమే. సినిమా అనేది నేను మెచ్చే వృత్తి, అది నా భాష” అని ప్రకాష్ రాజ్ అన్నారు. మీగత సమయం అంత తన కుటుంబం కోసం, వ్యవసాయం కోసం, వంట వండడం మరియు చదవడం కోసం కేటాయిస్తానని అయన తెలిపారు.

వంట గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తనకు వంట చేయడం అంటే చాలా ఇష్టమని, ఆ ఇష్టమే తనను ‘ఉలవచారు బిర్యాని’ సినిమా చేయడానికి స్పూర్తినిచిందని అన్నారు. ‘సాల్ట్ అండ్ పెప్పర్’ అనే మలయాళ సినిమాకు రీమేక్ గా వేస్తున్న ఈ సినిమా జూన్ 6న విడుదల కాబోతుంది.

Exit mobile version