“క్రాక్” డిజిటల్ ప్రీమియర్ పై ఫైనల్ క్లారిటీ.!

“క్రాక్” డిజిటల్ ప్రీమియర్ పై ఫైనల్ క్లారిటీ.!

Published on Jan 31, 2021 3:00 PM IST

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ పవర్ ఫుల్ మాస్ డ్రామా “క్రాక్”. తన హ్యాట్రిక్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కేవలం 50 శాతం సీటింగ్ తోనే సాలిడ్ రికార్డులు నెలకొల్పింది. అంతే కాకుండా అదే ఆంక్షలతో రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

అందుకే మరి ఈ ఈ చిత్రం డిజిటల్ రిలీజ్ పై అభిమానుల కోరిక మేరకు “ఆహా” వారు కొన్నాళ్ల పాటు ఆపేసారు. కానీ ఫైనల్ గా మాత్రం మాస్ మహారాజ్ క్రాక్ డిజిటల్ ప్రీమియర్ పై అఫీషియల్ గా మరోసారి అలెర్ట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఫిబ్రవరి 5న డిజిటల్ ప్రీమియర్ గా ఆహా లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఫైనల్ క్లారిటీ ఇచ్చేసారు. మై సరిగ్గా అదే రోజున మరో తమిళ్ మరియు మళయాళంలో ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు