“ఆదిపురుష్” ఈ క్రేజీ బజ్ పై క్లారిటీ వచ్చేసింది.!

Published on May 29, 2021 11:00 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రామునిగా కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది. అయితే వీరితో పాటుగా సైఫ్ అలీఖాన్ మరియు సన్నీ సింగ్ లు కూడా నటిస్తుండడం కన్ఫర్మ్ అయ్యింది.

కానీ గత కొన్ని రోజులు నుంచి ఈ చిత్రంలో బాలీవుడ్ మరో యంగ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా నటిస్తున్నాడని బజ్ రావడంతో ఈ సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అలా ఆ టాక్ మరింత బలపడుతున్న సమయంలో సిద్దార్థ్ శుక్లానే రీసెంట్ ఇంటర్వ్యూ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చాడు. తనకి అయితే ఇంకా ఎలాంటి కాల్ కానీ సంప్రదించడం కానీ జరగలేదని సో ఆ టాక్ అవాస్తవం అని తెలిపాడు. దీనితో గత కొన్నాళ్లుగా వైరల్ అవుతున్న రూమర్ కి చెక్ పడింది.

సంబంధిత సమాచారం :