అమీర్ ఖాన్ ఆలస్యం గా మేల్కొన్నాడు…!

Published on Aug 15, 2019 6:55 am IST

ఎట్టకేలకు అమీర్ ఖాన్ ఒక సౌత్ రీమేక్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన తమిళంలో సంచలన విజయం సాధించిన విక్రమ్ వేద సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నట్లు ఇటీవల అధికారకంగా కూడా ప్రకటించేశారు.

జానపద కథలలో అత్యంత ప్రాచుర్యం పొందిన విక్రమార్కుడు, బేతాళుడు పాత్రల ఆధారంగా, ఒక సిన్సియర్ పోలీస్ కి, క్రిమినల్ కిమధ్య జరిగే ఆధిపత్య పోరుగా ఈ చిత్రం తెరకెక్కింది. విక్రమ్ వేద మూవీలో పోలీస్ గా మాధవన్ చేయగా, క్రిమినల్ పాత్రలో విజయ్ సేతుపతి నటించారు. ఇప్పుడు హిందీలో క్రిమినల్ రోల్ అమీర్ చేస్తుండగా, పోలీస్ గా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. ఒరిజినల్ వర్షన్ కి దర్శకత్వం వహించిన దర్శక దంపతులు పుష్కర్ -గాయత్రి లే హిందీ రీమేక్ కూడా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్ పైకెళ్లనుంది.

కాగా మొదటిసారి అమీర్ ఓ సౌత్ మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. చిత్రాల ఎంపికలో మంచి పట్టున్న అమీర్, 3ఇడియట్స్, దంగల్, రంగ్ దే బసంతి, పి కె, లగాన్ వంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలలో నటించారు. ఐతే ఇప్పటివరకు ఆయన రీమేక్ ల పట్ల అంత ఆసక్తి చూపలేదు. ఈ విషయంలో సల్మాన్ చాలా ముందున్నారు.

సల్మాన్ వరుస అపజయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ పోకిరిని, వాంటెడ్ గా రీమేక్ చేసి హిట్స్ బాట పట్టారు. సల్మాన్ గత పదేళ్ల కాలంలో, బాడీ గార్డ్, రెడీ, కిక్ వంటి సౌత్ మూవీ రీమక్స్ తో విజయాలందుకున్నారు. ఇక అక్షయ్, అజయ్ దేవగణ్ కూడా సౌత్ చిత్రాల రీమేక్స్ పై ఆసక్తి చూపిస్తున్నారు.

అమీర్ కి మాత్రం సీక్రెట్ సూపర్ స్టార్, థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ వంటి రెండు వరుస పరాజయాలు పలకరించాక ఇప్పుడే జ్ఞానోదయం అయ్యినట్లుంది. అందుకే సల్మాన్ మాదిరిగా సౌత్ మూవీ విక్రమ్ వేద రీమేక్ కి రెడీ అయ్యారు.

సంబంధిత సమాచారం :