మొత్తానికి బాలయ్య కూడా షురూ చేసేసారు.!

Published on Oct 29, 2020 10:00 am IST

ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా తన ఆల్ టైం బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో హ్యాట్రిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ మసాలా ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఆ మధ్య బాలయ్య పుట్టినరోజున విడుదల చేసిన టీజర్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఆ అంచనాలు మరింత అయ్యాయి. కానీ అప్పటికే లాక్ డౌన్ ఉండడంతో ఈపాటికే చాలా వరకు కంప్లీట్ కావాల్సిన షూట్ ఆగిపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఎట్టకేలకు బాలయ్య మరియు బోయపాటిలు ఈ చిత్రం తాలూకా షూట్ ను షురూ చేసేసారు.

ఇటీవలే చెప్పిన విధంగా ఈరోజు అక్టోబర్ 29 నుంచి రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసేసినట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. మరి ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది ఇంకా కాలమే నిర్ణయించాల్సి ఉంది. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More