ఎట్టకేలకు అన్ని భాషల్లో “ఫ్యామిలీ మ్యాన్ 2”.!

Published on Aug 25, 2021 8:00 am IST

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో ప్రాముఖ్యత పొందిన ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో వెబ్ సిరీస్ లకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. అన్ని ముఖ్య దేశాల నుంచి కూడా ఎన్నో ఆసక్తికర టాప్ వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అలా మన దేశం నుంచి కూడా చాలానే ఆసక్తికర వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కూడా ఒకటి.

మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా ఉండే ఈ సిరీస్ లో నటుడు మనోజ్ భాజ్ పై మెయిన్ లీడ్ లో నటించగా రాజ్ అండ్ డీకే లు దర్శకత్వం వహించారు. అయితే రీసెంట్ గా వచ్చిన సీజన్ 2 ఆల్రెడీ భారీ హిట్ అయ్యింది. స్టార్ హీరోయిన్ సమంతా అక్కినేని విలన్ గా నటించిన ఈ సిరీస్ కి గాను ఆమెకి అవార్డు కూడా దక్కింది.

అయితే ఈ సిరీస్ దేశ వ్యాప్తంగా అన్ని కీలక భాషల వారికి చేరువయ్యిందా అంటే లేదని చెప్పాలి. తెలుగు మరియు తమిళ్ డబ్బింగ్ వెర్షన్ ల కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తుండగా అది ఇప్పుడు నెరవేరింది.

నిన్న సాయంత్రం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భాషలను సహా ఇంగ్లీష్ కూడా యాడ్ చేసి ఈ సిరీస్ ని వీక్షకుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇప్పుడు సౌత్ లో ఈ సిరీస్ మళ్ళీ ఒక రేంజ్ లో వీక్షిస్తారని చెప్పాలి.

సంబంధిత సమాచారం :