మాస్ “పుష్ప” రాజ్ వస్తున్నాడు..!

Published on Apr 3, 2021 7:06 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యంగ్ బ్యూటీ రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. ఇంటెలిజెంట్ టేకింగ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రంపై రొఆంటీ అంచనాలు ఓవరాల్ గా ఉన్నాయో తెలిసిందే. అంతే కాకుండా ఈ ఏప్రిల్ లొనే బన్నీ బర్త్ డే ఉండడంతో ఓ మాస్ అప్డేట్ కోసం అంతా ఎంతలా ఎదురు చూస్తున్నారో చూస్తూనే ఉన్నాము. కానీ ఎట్టకేలకు ఆ భారీ అప్డేట్ ను మేకర్స్ సూపర్ అనౌన్స్మెంట్ తో కన్ఫర్మ్ చేసేసారు.

బన్నీ ఈ చిత్రంలో మాట్లాడే చిత్తూరు యాసతో లోడ్ దింపుతున్నాం అని క్లారిటీ ఇవ్వడంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న వారి అందరికీ నూతన ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే మేకర్స్ ఒకటే వీడియో విడుదల చేస్తున్నారని తెలిసింది. మరి దాన్ని ఏ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. మరి ఈ భారీ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :