పవన్ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్డ్.

Published on Mar 1, 2020 12:59 pm IST

పవన్ ఫ్యాన్స్ కి కావాల్సిన కిక్ పింక్ రీమేక్ టీమ్ సిద్ధం చేసింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ సిద్ధం చేశారు. రేపు సాయంత్రం 5 గంటలకు పవన్ 26వ చిత్రంలోని ఆయన లుక్ మరియు టైటిల్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. పవన్ ఫస్ట్ లుక్ విడుదల కానుందని ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ నేడు స్పష్టమైన ప్రకటన వచ్చింది.

దర్శకుడు వేణు శ్రీరామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. పవన్ మొదటిసారి లాయర్ రోల్ చేస్తుండగా మేలో విడుదల కానుంది. ఇక ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More