అక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ మొదలై ఇన్ని రోజులైనా ఇన్నాళ్లు హీరోయిన్ సెట్ కాలేదు. అనేక మంది పేర్లను పరిశీలించిన టీమ్ పూజ హెగ్డేను అనుకున్నారు. కానీ అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలకు సైన్ చేసి ఉండటంతో ఆమె డేట్స్ కుదరలేదు. దాంతో వేరే ఆప్షన్స్ చూసిన నిర్మాతలు ఏవీ కుదరక మళ్లీ పూజా వద్దకే వెళ్లారు.
దాంతో పూజా అతి కష్టం మీద డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని సినిమాకు సైన్ చేసిందట. త్వరలోనే ఆమె షూటింగ్లో పాల్గొననుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు. గతంలో అల్లు అరవింద్ నాగ చైతన్య హీరోగా సుకుమార్ డైరెక్షన్లో ‘100 % లవ్’ అనే సినిమాను నిర్మించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకుంది. ఆ మాదిరిగానే ఇప్పుడు చేయబోతున్న అఖిల్ చిత్రం కూడా పెద్ద విజయం అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.
