తన సెన్సేషనల్ సినిమాకు ఓ డేట్ తెచ్చుకున్న వర్మ.!

తన సెన్సేషనల్ సినిమాకు ఓ డేట్ తెచ్చుకున్న వర్మ.!

Published on Dec 13, 2020 10:57 PM IST

rgv1

ఒకప్పుడు తన సినిమాలతో ఇండియా వైడ్ అపారమైన గుర్తింపు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఎలాంటి సినిమాలు తీస్తున్నాడో తెలిసిందే. ఏది ఏమైనప్పటికీ మాత్రం తాను చెప్పదలచుకున్నది నిక్కచ్చిగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అయితే ఇటీవలే కాలంలో మాత్రం పలు సంచలన సంఘటనలపై సినిమాలు తీయడం మొదలు పెట్టాడు. అలా తీసిన వాటిలో ఓ చిత్రమే “మర్డర్”.

గత రెండేళ్ల కితం హైదరాబాద్ లో జరిగిన ఓ దారుణ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నానని ప్రకటన ఇచ్చిన దగ్గర నుంచే భిన్నాభిప్రాయాలను వర్మ ఎదుర్కొన్నాడు. దీనిపై కోర్టు వరకు వెళ్లి ఆఖరికి విజయాన్ని తనవైపుకే తెచ్చుకున్నాడు. అలా ఇప్పుడు ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబర్ 24న విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించాడు. అయితే లేటెస్ట్ గా విడుదల చేసిన కరోనా వైరస్ సినిమాకు ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మరి దీనికి ఎలాంటి వసూళ్లు వస్తాయో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు