ఫైనల్ గా కదులుతున్న ‘రామాయణ’ బృందం?

Ramayana

ప్రస్తుతం ఇండియన్ సినిమా నుంచి ప్రపంచ ఆడియెన్స్ కి ఒక నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ని అందించే విధంగా సిద్ధమవుతున్న సినిమాలు రెండే ఉన్నాయి. ఆ సినిమాలే ఒకటి వారణాసి మరో చిత్రం రామాయణ. అయితే వీటిలో ఆల్రెడీ వారణాసి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రమోషన్స్ మారు మొగుతున్నాయి. కానీ రామాయణ మాత్రం ఈ విషయంలో వెనకబడి ఉంది. ఇక ఫైనల్ గా రామాయణ మేకర్స్ ఈ సినిమాని గ్లోబల్ ఆడియెన్స్ కి మరింత చేరువ అయ్యేలా ప్రమోషన్స్ ని మొదలు పెట్టనున్నట్టు తెలుస్తోంది.

అతి త్వరలోనే చిత్ర యూనిట్ యూఎస్ మార్కెట్ లో ఓ ప్రమోషనల్ ఈవెంట్ తో మొదలు పెట్టనున్నట్టు టాక్. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే దంగల్ దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమాకి హాలీవుడ్ సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కూడా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అవైటెడ్ హిస్టారికల్ సినిమా ఈ ఏడాది దీపావళి కానుకగా మొదటి భాగాన్ని విడుదల చేస్తున్నారు.

Exit mobile version