కోలీవుడ్ నటుడు సూర్య హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు ఆర్జే బాలాజీ తెరకెక్కించిన అవైటెడ్ మాస్ చిత్రమే వీర భద్రుడు. తమిళ్ లో కరుప్పు గా రెండు భాషల్లో ఏకకాలంలో థియేటర్స్ లో నిన్న మే 14న విడుదలకి ప్లాన్ చేశారు. కానీ ఈ సినిమా ఊహించని విధంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
దీనితో సాయంత్రం షోస్ నుంచి రెండు వెర్షన్ లలో థియేటర్స్ లో పడుతుంది అని అంతా అనుకున్నారు కానీ అది కూడా జరగలేదు. కానీ ఇప్పుడు ఫైనల్ గా సినిమాకి లైన్ క్లియర్ అయినట్లు సూర్య తెలిపారు.
ఇవాళ్టి నుంచి తన సినిమా థియేటర్స్ లో సందడి చేస్తుంది అని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్స్ తో విడుదల ఖాయం చేశారు. సో ఎట్టకేలకు థియేటర్స్ లో ఈ సినిమా విడుదల అవుతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి సాయి అభ్యంకార్ సంగీతం అందించాడు. అలాగే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.
Dear all…
Thank you for being with us! 🙏🏽#Karuppu #VeeraBhadrudu from today!@RJ_Balaji @trishtrashers @dop_gkvishnu @SaiAbhyankkar @prabhu_sr @DreamWarriorpic @thinkmusicindia pic.twitter.com/iXxw5V8FiH— Suriya Sivakumar (@Suriya_offl) May 15, 2026


