మన ఇండియన్ సినిమా సహా ఎంటర్టైన్మెంట్ రంగంలో భాగమైన ఓటిటిలలో కూడా పలు సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీస్ లు లాంటివి ఉన్నాయి. మరి అలాంటి కంటెంట్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అయ్యి మంచి హిట్ అయ్యిన వాటిలో హీరో షాహిద్ కపూర్ హీరోగా రాశి ఖన్నా ఫీమేల్ లీడ్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా కీలక పాత్రలో నటించిన క్రేజీ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ “ఫర్జీ”(Farzi) కూడా ఒకటి.
నకిలీ నోట్లతో నడిచే ఈ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 2023లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చింది. అయితే దీనికి సీక్వెల్ ని కూడా అప్పుడు టీజ్ చేశారు. మరి ఫైనల్ గా ఈ సిరీస్ పై సాలిడ్ అప్డేట్ ని దర్శకులు రాజ్ అండ్ డీకేలు అందించారు. రౌండ్ 2 ఇన్ ప్రోగ్రెస్ అంటూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఆసక్తి రేకెత్తించారు. ఇక ఇందులో మొత్తం 2000 రూపాయల నోట్ల కట్టలే కనిపిస్తున్నాయి. సో ఈసారి క్రైమ్ అండ్ థ్రిల్స్ ఇంకా గట్టిగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ బయటికి రావాల్సి ఉన్నాయి.
