కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఈ ఏడాది కరుప్పు/వీరభద్రుడు సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఆ సినిమా తర్వాత రానున్న అవైటెడ్ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య అంతా అప్డేట్స్ తో ట్రీట్ ఇచ్చిన మేకర్స్ కొన్నాళ్ల నుంచి సైలెంట్ గానే ఉన్నారు. పైగా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అభిమానులు ఓ క్లారిటీ కోరుకోగా ఫైనల్ గా ఇవాళ ఓ అప్డేట్ రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు.
సో ఆ అప్డేట్ కోసం ఇప్పుడు సూర్య ఫ్యాన్స్ ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఓ సాంగ్, గ్లింప్స్ వచ్చి ఆకట్టుకున్నాయి. సో ఇవాళ ఏ అప్డేట్ ఇస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా మమితా బైజు హీరోయిన్ గా నటించింది. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు. ఈ ఆగస్ట్ 14న సినిమా విడుదల కానుంది.
