రవితేజ ‘పవర్’ షూటింగ్ లో ఫైర్ యాక్సిడెంట్..!

రవితేజ ‘పవర్’ షూటింగ్ లో ఫైర్ యాక్సిడెంట్..!

Published on Jul 29, 2014 9:00 AM IST

Power

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘పవర్’ సినిమా షూటింగ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎటువంటి హాని జరగలేదు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలను బ్యాంకాక్ లో షూట్ చేస్తున్నారు. కార్ చేజ్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో డమ్మీ బాంబు కాస్త ముందుగా పేలింది. సమీపంలో ఎవరు లేకపోవడంతో మూవీ యూనిట్ సురక్షితంగా బయటపడ్డారు. బ్యాంకాక్ షెడ్యూల్ చివరి రోజున ఈ సంఘటన జరిగింది.

రవితేజ సరసన హన్సిక, రెజినా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా కెఎస్ రవీంద్ర(బాబీ) దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. రవితేజ ఈ సినిమా కోసం పాట పాడారు. ‘బలుపు’లో రవితేజ పాట పాడిన సంగతి తెలిసిందే. రాక్ లైన్ వెంకటేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజా వార్తలు