యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్త చిత్రం ‘ఆదిపురుష్’ ఈరోజే ముంబైలో అట్టహాసంగా మొదలైంది. పూజా కార్యక్రమాలతో చిత్రీకరణ మొదలుపెట్టారు టీమ్. ముంబైలోని గోరేగాన్ స్టూడియోలో స్పెషల్ సెట్ వేసి షూటింగ్ చేస్తున్నారు. ప్రభాస్, సైఫ్ అలీఖాన్ షూటింగ్లో పాల్గొంటున్నారు. కాగా మంగళవారం సాయంత్రం సెట్లో మంటలు చెలరేగాయట. గ్రీన్ మ్యాట్స్ లాంటి వాటికి నిప్పు అంటుకుందట.
అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు అంటుకున్న వెంటనే 8 ఫైర్ ఇంజిన్లు, 5 జంబో ట్యాంకర్లు, ఒక వాటర్ ట్యాంకర్, జేసీబీ రంగంలోకి దిగి మంటలు వ్యాపించకుండా అదుపు చేయగలిగాయి. దీంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్, సైఫ్ అలీఖాన్ సెట్లో లేకపోవడం మంచిదైంది. షాక్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు.


