తమిళ హీరో విజయ్ ఆంటోనీ సినిమాలకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించిన ‘బిచ్చగాడు, బేతాళుడు’ వంటి సినిమాలు ఇక్కడ కూడా మంచి విజయాల్ని సొంతం చేసుకున్నాయి. అందుకే ఆయన తన ప్రతి సినిమాని తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. తాజాగా ఆయన నటించిన ‘కాళి’ సినిమా తెలుగులో ‘కాశి’ పేరుతో విడుదలకానుంది.
ప్రమోషన్లలో భాగంగా తన అన్ని సినిమాలకు చేసినట్టుగానే ఈ చిత్రాన్ని కూడ మొదటి 7 నిముషాలు ఈరోజు సాయంత్రం 6 గంటలకు యూట్యూబ్, పేస్ బుక్, ట్విట్టర్ ద్వారా విడుదలచేయనున్నారు. కిరుతిగ ఉదయనిధి డైరెక్ట్ చేసియాన్ ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోనీ స్వయంగా నిర్మించారు. ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాను లెజండ్ సినిమా పతాకంపై ఉదయ్ హర్ష వడ్డెల, గణేష్ పెనుబోతు, ప్రధ్యుమ్న చంద్రపతి తెలుగులో విడుదల చేస్తున్నారు.


