నాని “హాయ్ నాన్న” నుంచి ఫస్ట్ చార్ట్ బస్టర్ సాంగ్.!

hi nanna 2
నాచురల్ స్టార్ నాని హీరోగా తన కెరీర్ లో సెన్సేషనల్ హిట్ చిత్రం “దసరా” తర్వాత తన కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రం “హాయ్ నాన్న” చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి అయితే మేకర్స్ ఇప్పుడు మొట్ట మొదటి సాంగ్ ని రిలీజ్ చేశారు. సమయమా అనే ఈ లిరికల్ సాంగ్ ని అనురాగ్ కులకర్ణి ఆలపించగా ఇన్స్టంట్ గా క్లిక్ అయ్యే సాంగ్ లా అయితే ఇది అనిపించింది.

అలాగే ఆల్రెడీ ఖుషి సినిమాతో అయితే చార్ట్ బస్టర్ ఆల్బమ్ ని అందించిన సంగీత దర్శకుడు హీషం అబ్దుల్ వహద్ ఈ చిత్రానికి కూడా అదిరే ఫస్ట్ సాంగ్ ని ఇచ్చాడు అని చెప్పొచ్చు. మరి ఫుల్ ఆల్బమ్ లో మిగతా సాంగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా యువ దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతకు చేపట్టి డెబ్యూ ఇవ్వబోతున్నాడు. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version