పాన్ ఇండియా ఫస్ట్ ఛాయిస్ ప్రభాసేనా..?

Published on Feb 29, 2020 2:25 pm IST

బాహుబలి చిత్రం తర్వాత దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్ ఆ తరువాత కూడా అదే స్థాయిలో భారీ చిత్రాలు చేస్తున్నారు. ఆయన గత చిత్రం సాహో 300 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కగా 420 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసింది. ఇక ప్రస్తుతం చేస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామా సైతం 150 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని పలు భాషలలో భారీగా నిర్మించనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లనుంది.

కాగా భారీ బడ్జెట్ చిత్రాలకు ప్రభాస్ కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిపోయారు. ఇకపై అయన నుండి వచ్చే ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటుంది. హిందీలో ప్రభాస్ కి భారీ క్రేజ్ ఉంది, సాహో ఫలితమే అందుకు నిదర్శనం. కాబట్టి టాలీవుడ్ దర్శక నిర్మాతలలో ఎవరికైనా పాన్ ఇండియా సినిమా తీయాలంటే ఫస్ట్ ఛాయిస్ గా ప్రభాస్ మారాడు.

సంబంధిత సమాచారం :

X
More