దేశంలోనే మొట్ట మొదటి సీజీ చిత్రం ‘అమ్మోరు’

దేశంలోనే మొట్ట మొదటి సీజీ చిత్రం ‘అమ్మోరు’

Published on Nov 24, 2020 2:11 AM IST


నిర్మాణ సంస్థ ఎం.ఎస్.ఆర్ట్ మూవీస్ మరుపురాని సినిమాలను అందించింది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు వేసిన కొన్ని సాహసోపేతమైన అడుగులు తెలుగు సినిమా గమనాన్నే మార్చివేశాయి. అలా ఆయన చేసిన సాహసాల్లో ‘అమ్మోరు’ చిత్రం కూడ ఒకటి. అప్పటి వరకు పొందని సినిమాటిక్ అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందివ్వాలనే ఉద్దేశ్యంతో శ్యామ్ ప్రసాద్ రెడ్డిగారు సీజీ టెక్నాలజీని ఈ చిత్రంతో ఇండియాకు తీసుకొచ్చారు. అప్పటి వరకు ఎన్నో మైథలాజికల్ ఫాంటసీ సినిమాలను చూసిన ప్రేక్షకులకు ‘అమ్మోరు’ చిత్రంలోని గ్రాఫిక్స్ అమితంగా థ్రిల్ చేశాయి.

ఒక్క టాలీవుడ్ మాత్రమే కాదు దేశ సినీ పరిశ్రమే ఈ చిత్రంలోని టెక్నికల్ వర్క్ చూసి అబ్బుర పడింది.
సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ మొత్తం లండన్ లోనే జరగడం విశేషం. దీనికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ బ్రిటిష్ దేశస్తులే. రీల్ వాడకం ఉండే ఆ సమయంలో వేరొక దేశంలో సీజీ వర్క్ అంటే ఎంతటి కష్టంతో కూడుకున్న విషయమో చెప్పాల్సిన పని లేదు. భారీ వ్యయంతో ఈ పనులన్నీ చేశారు ఎం.ఎస్.రెడ్డిగారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. చిత్రం విడుదలయ్యాక యావత్ భారతీయ సినీ పరిశ్రమ తెలుగు ఇండస్ట్రీ వైపు చూసింది. సీజీని మొదటిసారి భారతీయ సినిమాకు పరిచయం చేసిన ఘనత ఈ సినిమాకే దక్కింది.

ఎం. ఎస్. ఆర్ట్స్ యూనిట్ కథ సిద్ధం చేయగా సత్యానంద్ మాటలు రాశారు. చక్రవర్తి, శ్రీకొమ్మినేని ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. ఈ విజువల్ వండర్ కు సి.విజయ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. చిత్ర సమర్పకులైన సహజకవి మల్లెమాల సుందరరామిరెడ్డి సినిమాలో పాటలు కూడ రాశారు. సౌందర్య, రామిరెడ్డి, రమ్యకృష్ణ, సురేష్ ల, బేబీ సునయన ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. 25 ఏళ్ళ క్రితం ఇదే నవంబర్ 23వ తేదీన విడుదలైన చిత్రం ఘన విజయం అందుకుంది. ఈ సినిమాతో నిర్మాత ఎం.ఎస్.రెడ్డి పేరు దేశవ్యాప్తమైంది.

అమ్మోరు సినిమా చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు