వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న స్టార్ హీరో సినిమా ‘ఫస్ట్ లుక్’

వినాయక చవితి సందర్భంగా విడుదల కానున్న స్టార్ హీరో సినిమా ‘ఫస్ట్ లుక్’

Published on Aug 20, 2018 5:29 PM IST


తమిళంలో ‘అజిత్’ ఎంత పెద్ద స్టారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమిళంలో రజనీకాంత్ తర్వాత అంతటి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్న హీరో ‘అజిత్’. ఆయన సినిమా వస్తుందంటే తమిళ థియేటర్స్ అన్నీ కళకళలాడిపోతాయి. జె. శివ కుమార్ దర్శకత్వంలో అజిత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వాసం’.ఈ చిత్రంలో అజిత్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అజిత్ సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.

కాగా తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను వినాయక చవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 13న విడుదల చేయబోతున్నామని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. యోగి బాబు , తంబీ రామయ్య , రోబో శంకర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి డి ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు . ఇక వివేగం సినిమా తరువాత అజిత్ శివ కలయికలో వస్తున్న ఈ చిత్రం ఫై భారీ అంచనాలు వున్నాయి .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు