రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ‘ఎవడు’ ఫస్ట్ లుక్

రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ‘ఎవడు’ ఫస్ట్ లుక్

Published on Mar 14, 2013 10:30 AM IST

Yevadu

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఎవడు’ సినిమా ఫస్ట్ లుక్ మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో యాక్షన్ థిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ఒక ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. వంశీ పైడిపల్లి ఈ సినిమా స్టోరీ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, తెలుగు సినిమాలలో ఇప్పటి వరకు రానటువంటి, ఫ్రెష్ స్టోరీతో నిర్మిస్తున్నామని అన్నాడు. చరణ్ ఒకేసారి ఈ సినిమాతో పాటుగా హిందీ సినిమా ‘జంజీర్’ లో కూడా నటిస్తున్నాడు. ఈ సంవత్సరం ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు