కమల్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

కమల్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Published on May 21, 2015 9:51 PM IST

kamal-hassan
నటుడిగా, కథా రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, దర్శకుడిగా, నిర్మతగా తన టాలెంట్ ని నిరూపించుకొని ఎన్నో సంవత్సరాలుగా సౌత్ ఇండియన్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న స్టార్ హీరో కమల్ హాసన్. ఇటీవలే విడుదలైన ఉత్తమ విలన్ సినిమాతో విమర్శకులను మెప్పించిన కమల్ హాసన్ త్వరలో తెలుగు – తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకి శ్రీకారం చుట్టారు. చాలా రోజుల తర్వాత డైరెక్ట్ తెలుగులో చేస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 24 నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది.

సినిమాని లాంచ్ చేసిన రోజునే షూటింగ్ మొదలు పెట్టడం మరియు ఆ మరుసరోజే సినిమాకి సంబదించిన ఫస్ట్ లుక్ ని రివీల్ చెయ్యడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కమల్ హాసన్ ఇలాంటి పనినే చేయనున్నాడు. మే 24న షూటింగ్ మొదలు పెట్టి మే 25న ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నాడు. దానికి సంబదించిన ఫోటో షూట్ ని కూడా పూర్తయ్యింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబద్ లో 20 రోజులు జరగనుంది. ఆ తర్వాత 40 రోజుల షెడ్యూల్ చెన్నైలో జరుగుతుంది.

తమిళంలో ఈ సినిమాకి తూంగావనం అనే టైటిల్ ఖరారు చేయగా తెలుగులో ఓ మంచి టైటిల్ కోసం అన్వేషిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మరో మెయిన్ రోల్ చేస్తున్న ఈ సినిమా ద్వారా కమల్ అసిస్టెంట్ రాజేష్ సెల్వ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. కమల్ తన హోం బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించనున్నాడు.

తాజా వార్తలు