
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటిస్తున్న 25వ సినిమా ‘నాన్నకు ప్రేమతో'(వర్కింగ్ టైటిల్). 25 అనే నెంబర్ చాలా స్పెషల్, ఆ నెంబర్ లానే సినిమాని కూడా చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు ఎన్.టి.ఆర్. అందుకే తన లుక్ మొత్తాన్ని మార్చుకొని ఇదివరకెప్పుడూ కనిపించని స్టైల్ లో కనిపించనున్నాడు. రొటీన్ కి భిన్నంగా సినిమాలు చేసే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. ఈ సినిమాకి ఫైనల్ గా ‘నాన్నకు ప్రేమతో’ అనే టైటిల్ నే ఫైనలైజ్ చేసారని ఈ చిత్ర సన్నిహితులు చెబుతున్నారు. టైటిల్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్న అభిమానులకు ఈ చిత్ర టీం తీపి కబురు చెప్పింది.
అదే వినాయక చవితి కానుకగా అనగా సెప్టెంబర్ 17న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేయనున్నారు. ఈ ఫస్ట్ లుక్ లో టైటిల్ ని కూడా అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. దీని ప్రకారం వినాయక చవితి రోజున ఎన్.టి.ఆర్ కూడా తన అభిమానులకు ఈ విధంగా ట్రీట్ ఇవ్వనున్నాడు. ఎన్.టి.ఆర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ లు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జనవరి 8న 2016 సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

