సక్సెస్ టూర్ లో ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ !

Published on Jun 24, 2019 10:00 pm IST

విజయవాడ లో ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా టీమ్ సందడి చేసింది. డాల్ఫిన్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు హెచ్.ఎన్.నరేష్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ విజయయాత్రలోభాగంగా విజయవాడ లో ఓ హోటల్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ…అన్ని చోట్లా సినిమాకి మంచి స్పందన వస్తుందన్నారు. విజయవాడలో ప్రేక్షకులు కూడా సినిమాను ఆదరిస్తున్నారని అన్నారు. చిన్న చిన్న సినిమాలను కూడా ప్రజలు ఆదరించడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. ప్రేక్షకుల ఆదరణ తమపై ఇలాగే ఉండలని కోరారు. అనంతరం హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ…సినిమా విడుదల కాగానే అన్ని చోట్లా మంచి స్పందన వస్తుందన్నారు. సినిమాలో యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సందేశాన్ని ఈ సినిమా అందిస్తుందని తెలిపారు.

సంబంధిత సమాచారం :

X
More