టీజర్: “ఫస్ట్ ర్యాంక్ రాజు” – ఫస్ట్ ర్యాంక్ రాజు, ఐతే ఏంటి ?

Published on Jun 16, 2019 11:59 am IST

చేతన్ మద్దినేని, కాశిక్ వోహ్రా హీరో హీరోయిన్స్ గా నరేశ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ “ఫస్ట్ ర్యాంక్ రాజు”. ఈ మూవీ టీజర్ చిత్ర బృందం నిన్న విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలపై ఒక సెటైరికల్ మూవీ అనిపిస్తుంది. ఈ మూవీ నరేష్ తన కొడుకైన రాజు భవిష్యత్ బాగుండాలని చిన్నప్పటినుండి పుస్తకాలే ప్రంపంచంగా, ర్యాంక్ లే లక్ష్యంగా సామజిక అంశాలపై, మంచి చెడులపై అవగాహన లేకుండా పెంచుతాడు. అలా పెరిగిన రాజు సొసైటీలో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి జాబ్ విషయంలో కూడా ర్యాంక్ కాదు జనరల్ నాలెడ్జ్ కావాలని అవగతం అవుతుంది. చివరికి తనని తానూ ఎలా మార్చుకున్నాడు,తన గోల్ ఎలా సాదించాడనేదే సినిమా కథ అని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది.

టీజర్ లో వెన్నెల కిషోర్,ప్రియదర్శి,పోసాని కామెడీ బాగుంది. సామజిక అవగాహన లేని రాజుగా,అలాగే అల్ట్రా మోడ్రన్ స్టూడెంట్ గా రెండు షేడ్స్ లో హీరో నటన బాగుంది. హీరోయిన్ కాశిక్ గ్లామర్ గా కనిపిస్తుంది. ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ తో అంచనాలు పెరిగేలా చేసింది. గ్యారంటీ గా ప్రేక్షకుడికి వినోదం పంచె అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయనిపిస్తోంది.

నరేష్,ప్రకాష్ రాజ్,బ్రహ్మానందం,ప్రియదర్శి,వెన్నెల కిశోర్,పోసాని ముఖ్యపాత్రలలో నటిస్తున్న ఈ మూవీ డాల్ఫిన్ ఎంటరైన్మెంట్స్ బ్యానర్ పై వి.కందుకూరు నిర్మిస్తుండగా,కిరణ్ రవీంద్రనాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More