రవి తేజ “ఖిలాడి” నుండి ప్రోమో విడుదల కి సిద్దం!

Published on Sep 6, 2021 1:15 pm IST


రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా, మీనాక్షి చౌదరీ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ఖిలాడి. ఈ చిత్రం లో డింపుల్ హాయాతీ, అర్జున్ సర్జా, ఉన్ని ముకుందన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎ స్టూడియోస్ ఎల్ ఎల్ పి పతాకం పై ఈ చిత్రాన్ని సత్యనారాయణ కోనేరు మరియు వర్మ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రవి తేజ డ్యుయల్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రం నుండి ఫస్ట్ సింగిల్ విడుదల పై చిత్ర యూనిట్ తాజాగా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 10 వ తేదీన ఇష్టం పూర్తి లిరికల్ సాంగ్ విడుదల కానుంది. అందుకు సంబంధించిన ప్రోమో రేపు చిత్ర యూనిట్ విడుదల చేయనుంది. ఈ చిత్రం లో రవితేజ డ్యుయల్ రోల్ చేస్తుండటం తో సినిమా పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :