గత ఏడాది 2.0 మరియు కాల చిత్రాలు విడుదల చేసిన రజిని ఈఏడాది పేట మూవీ చేయడం జరిగింది. ఇక ఆయన నటించిన దర్బార్ మూవీ సంక్రాంతి పండుగకు సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో ఒకరైన ఏ ఆర్ మురుగదాస్ మొదటిసారి రజిని కాంత్ మూవీ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో రజిని ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. కథరీత్యా దర్బార్ మూవీ ముంబై నేపథ్యంలో నడుస్తుంది. కనుక దాదాపు షూటింగ్ మొత్తం ముంబైలో చిత్రీకరించారు. ముంబై మాఫియా పై పోలీస్ పోరాటమే దర్బార్ మూవీ కథ అని తెలుస్తుంది.
కాగా ఈ మూవీ నుండి మొదటి సాంగ్ రేపు విడుదల చేయనున్నారు. ‘చుమ్మా కిజి…’ అనే తమిళ సాంగ్ రేపు విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ చిత్ర బృందం అనౌన్స్మెంట్ పోస్టర్ విడుదల చేశారు. తమిళంతో పాటు తెలుగు, హిందీలో కూడా ఈ మూవీ విడుదల కానున్న తరుణంలో మరి తెలుగు, హిందీలో కూడా ఈ సాంగ్ విడుదల చేస్తారా అనేది చూడాలి. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నారు.
