కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ నుండి ఫస్ట్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్

Published on Sep 14, 2023 6:30 pm IST

యువ నటుడు నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల బింబిసార, అమిగోస్ మూవీస్ ద్వారా రెండు విజయాలు సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న థ్రిల్లింగ్ యాక్షన్ పాన్ ఇండియన్ మూవీ డెవిల్. సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తూ స్వయంగా తెరకెక్కిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయి అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచింది.

ఇక తాజాగా డెవిల్ నుండి మాయే చేసే అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమోని రేపు రిలీజ్ చేయడంతో పాటు ఫుల్ సాంగ్ ని సెప్టెంబర్ 19న సాయంత్రం 4 గం. 5 ని. లకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ మూవీ స్వాతంత్రోద్యమానికి ముందు జరిగే కథగా తెరకెక్కుతుండగా ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నందమూరి కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. కాగా ఈ మూవీని నవంబర్ 24న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.

సంబంధిత సమాచారం :