విడుదలైన సువర్ణ సుందరి చిత్రంలోని “సాహో సార్వ భౌమి” సాంగ్ !

విడుదలైన సువర్ణ సుందరి చిత్రంలోని “సాహో సార్వ భౌమి” సాంగ్ !

Published on Sep 28, 2018 2:36 PM IST

suvarna

ప్రముఖ నటి జయప్రద, పూర్ణ, సాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లొ నటిస్తున్న చిత్రం “సువర్ణసుందరి”. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి సూర్య ఎమ్.ఎస్.ఎన్ దర్శకత్వం వహిస్తున్నారు. చరిత్ర భవిష్యత్తుని వెంటాడుతొందన్న ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ తో భారీ బడ్జెట్ తో సాంకేతిక హంగులతో ఎస్.టీమ్ పిక్చర్స్ పతాకంపై ఎమ్.ఎల్. లక్ష్మి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సాయి కార్తీక్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలొని “సాహో సార్వభౌమి” పాటను ఈ రోజు విడుదల చేశారు‌. ఈ సందర్బంగా సాయి కార్తీక్ మాట్లాడుతూ సువర్ణసుందరి ఓ భారీ సూపర్ నేచురల్ థ్రిల్లర్ . దర్శకుడు సూర్య ఆడియెన్స్ థ్రిల్ అయ్యేలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా నా కెరీర్ లొ ఓ అత్యుత్తమ చిత్రం గా నిలిచి పొనుందని అన్నారు. సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రల్లో నటించిన ఈచిత్రం త్వరలోనే విడుదల కానుంది.

 

సాంగ్ మేకింగ్ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు