చైనాలో విడుదలవుతున్న మొదటి తమిళ సినిమా

చైనాలో విడుదలవుతున్న మొదటి తమిళ సినిమా

Published on Aug 10, 2018 8:37 PM IST

Mersal

ఇళయ దళపతి విజయ్ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం ‘మెర్సల్’. యువ దర్శుకుడు అట్లీ తెరకెక్కించిన ఈ చిత్రం గత ఏడాది దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రం సుమారు రూ 200కోట్ల పైచిలుకు వసూళ్లను రాబట్టి బ్లాక్ బ్లస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రఖ్యాత తేనాండాళ్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని 120 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. తెలుగు లో ఈ చిత్రం ‘అదిరింది’ పేరుతో విడుదలై పర్వాలేదనే వసూళ్లను రాబట్టింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం తాజాగా చైనా లో విడుదలకానుంది. ఇప్పటివరకు అక్కడ ఒక్క తమిళ సినిమాకు రిలీజ్ కాలేదు. ఇప్పుడు ‘మెర్సల్’ అక్కడ విడుదలై చైనా లో విడుదలైన మొదటి సినిమా గా రికార్డు సృష్టించనుంది. ధూమ్ 3 చిత్రాన్ని అక్కడ విడుదల చేసిన చైనీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ హెచ్ జి సి ఈ చిత్రాన్ని విడుదలచేయనుంది.

తాజా వార్తలు