‘గోవిందుడు అందరివాడేలే’ ఫస్ట్ టీజర్ రన్ టైం

‘గోవిందుడు అందరివాడేలే’ ఫస్ట్ టీజర్ రన్ టైం

Published on Jul 11, 2014 10:00 AM IST

Govindudu-Andarivadele
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని డైరెక్టర్ కృష్ణవంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న రిలీజ్ చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్ర బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ చాలా బాగా వచ్చిందని, చరణ్ అభిమానులకు దసరా పండగే అని అన్నారు.

మేము రామ్ చరణ్ అభిమానులకు ఈ దసరా పండుగ ఎంతసేపు ఉంటుందా అని తెలుసుకుంటే.. జూలై 28న రిలీజ్ చేయనున్న ఫస్ట్ టీజర్ రన్ టైం 40 సెకన్లని తెలిసింది. దీనికి సంబందించిన టీజర్ కట్ కూడా అయిపోయింది. ఈ నెల 13 నుంచి పొల్లాచ్చిలో ఈ చిత్ర న్యూ షెడ్యూల్ ప్రారంభం కానుంది. అక్కడ 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకున్నాక ఈ చిత్ర టీం తిరిగి హైదరాబాద్ వస్తుంది.

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, శ్రీ కాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతమా న్దిస్తున్న ఈ సినిమా అక్టోబర్ మొదటి వారంలో రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు