“నారప్ప” విషయంలో మణిశర్మకు ఎదురైన చేదు అనుభవం.!

“నారప్ప” విషయంలో మణిశర్మకు ఎదురైన చేదు అనుభవం.!

Published on Jan 17, 2021 10:00 AM IST

పాటలైనా సరే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా సరే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చే ఆల్బం కు నేటి తరంలో ఫ్యాన్స్ ఉన్నారు. లేటెస్ట్ గా “ఇస్మార్ట్ శంకర్”తో సాలిడ్ కం బ్యాక్ ఇచ్చిన ఈ లెజెండరీ సంగీత దర్శకుడు మరిన్ని అదిరిపోయే ప్రాజెక్ట్ లుతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి తాను చేస్తున్న ఆసక్తికర ప్రాజెక్టులలో విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “నారప్ప” కూడా ఒకటి.

మరి ఈ సినిమా విషయంలో మణిశర్మ ఇంతకు ముందు ఎప్పుడు ఎదుర్కొని చేదు అనుభవం కోసం లేటెస్ట్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా వచ్చిన ఓ టీజర్ వీడియోలో ఒరిజినల్ వెర్షన్ “అసురన్” బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నే తన ప్రమేయం లేకుండా పెట్టేసి విడుదల చేసారని పైగా తన పేరు కూడా వేసినట్టుగా తెలిపారు.

దానితో అక్కడ నుంచి తాను ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను కాపీ కొట్టానని అన్నారని తెలిపారు. అది పెద్ద కాంట్రావర్సీ కూడా అయ్యిందని ఆయన తెలిపారు. అసలు మన తెలుగులోనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటేనే మొదటగా గుర్తొచ్చేది మణిశర్మ. తనదైన పవర్ ఫుల్ అండ్ ట్రెండీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించే మణిశర్మకు ఇలాంటి అనుభవం ఎదురు కావడం బాధాకరమైన అంశమే అని చెప్పాలి. మరి నారప్ప మేకర్స్ ఆయనకు ఏం సంజాయిషి చెప్పారో వాళ్ళకే తెలియాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు