రంభ ఊర్వశి మేనక బాక్సాఫీస్: తొలి వారాంతంలో రూ. 4.40 కోట్లు !

రంభ ఊర్వశి మేనక బాక్సాఫీస్: తొలి వారాంతంలో రూ. 4.40 కోట్లు !

Published on Sep 7, 2026 2:43 PM IST

అల్లరి నరేష్ నటించిన తాజా తెలుగు చిత్రం రంభ ఊర్వశి మేనక. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వం వహించిన ఈ ఫాంటసీ కామెడీ చిత్రంలో రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణు ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అయితే, ఈ చిత్రానికి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, కానీ ఆదివారం నాడు బాక్సాఫీస్ వద్ద కొంత మెరుగుదల కనిపించింది. చిత్ర నిర్మాతల ప్రకారం, ఈ చిత్రం తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 4.40 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. నిజానికి అల్లరి నరేష్ నటించిన చిత్రానికి వసూళ్లు ఇంకా బలంగా రావాల్సింది.

సినిమాలో దర్శకుడు చంద్రమోహన్ చింతాడ చెప్పాలనుకున్న కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఈ ఫాంటసీ ఫన్ డ్రామాలో.. మెయిన్ థీమ్, కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. మొత్తానికి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ప్రదర్శనకు ఈ వారం కీలకం కానుంది. ఇక శ్రీనివాస రెడ్డి, వి.కె. నరేష్ మరియు వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ మరియు హాస్య మూవీస్ నిర్మించాయి.

తాజా వార్తలు