మహేష్ కమిట్మెంట్ సూపర్ అంటున్న ఫిట్నెస్ ట్రైనర్..!

మహేష్ కమిట్మెంట్ సూపర్ అంటున్న ఫిట్నెస్ ట్రైనర్..!

Published on May 20, 2020 2:57 PM IST


ప్రొఫెషనల్ జిమ్నాజియం ట్రైనర్ మినాష్ గాబ్రియేల్ మహేష్ డెడికేషన్, కమిట్మెంట్ పై ఓ సుదీర్ఘమైన సోషల్ మీడియా పోస్ట్ పెట్టారు. మినాష్ గాబ్రియేల్, మహేష్ దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో గత ఏడాది నటించిన మహర్షి సినిమా కోసం మహేష్ లుక్ కోసం ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేయడం జరిగింది. ఆ సమయంలో మినాష్ ట్రైనింగ్ వలన నేను చాలా హెల్తీ మరియు ఫిట్ గా ఉన్నట్లు మహేష్ కోట్ చేశారు. అది గుర్తు చేసుకుంటూ మినాష్ మహేష్ కమిటెడ్ యాక్టర్ మరియు డెడికేటెడ్ పర్సనాలిటీ అన్నారు.

ప్రతి రోజు చివరి రోజు వలె ట్రైనింగ్ సెషన్స్ లో మహేష్ కష్టపడే వారట. ఇక డైట్ విషయంలో స్ట్రిక్ట్ మెనూ ఫాలో అయ్యేవారని, అతనితో పని చేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని మినాష్ గాబ్రియేల్ తన సోషల్ మీడియా పోస్ట్ లో తెలియజేశారు. ఇక మహేష్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ మూవీ ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ దర్శకుడు పరుశురాం తో తన తదుపరి చిత్రం చేస్తుండగా, ఈనెల 31న అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కలదు.

https://www.instagram.com/p/CAZcMMFA716/

సంబంధిత సమాచారం

తాజా వార్తలు