‘రంగస్థలం’లో ఆ ఐదు పాత్రలు ప్రధానం !
Published on Mar 13, 2018 1:06 pm IST

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటిస్తోన్న ‘రంగస్థలం’ సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నెల 18 న వైజాగ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చెయ్యబోతున్నారు చిత్ర యూనిట్. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది.

తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ముఖ్యంగా ఐదు పాత్రలు ప్రధానంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అందులో చరణ్, సమంత తరువాత ఆది పినిశెట్టి, జగపతిబాబు, అనసూయ రోల్స్ కథలో కీలక పాత్ర పోషిస్తాయట. సినిమా ఎక్కువ భాగం వీరి పాత్రల చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ‘రంగస్థలం’ సినిమా ద్వారా సుకుమార్ తన మార్క్ ప్రేమ కథను ప్రేక్షకులకు పరిచయం చెయ్యబోతున్నాడు.

 
Like us on Facebook