ఒక సినిమా.. ఆరుగురి భవిష్యత్తు.. ఏమవుతుంది !

Published on Jun 24, 2019 3:13 pm IST

సినిమా ఒక్కటే.. కానీ దాని మీద ఆశలు పెట్టుకున్నవారు మాత్రం చాలామంది ఉన్నారు. అదే ‘ఇస్మార్ట్ శంకర్’. ఈ సినిమా బృందంలోని ముఖ్యులు చాలామందికి ఉన్నపలంగా హిట్ చాలా అవసరం. ప్రథమంగా హీరో రామ్. గత రెండు సినిమాలు పరాజయాలు చెందడంతో డీలా పడిన రామ్ ఈ సినిమా తిరిగి తనకు వేగాన్ని ఇస్తుందని బోలెడు ఆశలతో ఉన్నారు. పూరి నమ్మి మిగతా ప్రాజెక్ట్స్ పక్కనబెట్టి మరీ ఈ చిత్రాన్ని చేశాడు.

ఇక పూరి.. 2015లో ‘జ్యోతిలక్ష్మి’తో మొదలైన ఆయన పరాజయాల పరంపర నిన్న మొన్నటి ‘మహబూబా’ వరకు సాగింది. ఈసారి గనులకు హిట్ కొట్టకపోతే ప్రేక్షకుల్లో ఉన్న ఆ కాస్త క్రేజ్ కూడా క్షీనిస్తుంది. అందుకే మాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ చేసి ఈ సినిమా చేశారు పూరి. అలాగే సంగీత దర్శకుడు మణిశర్మ. గత కొన్నేళ్ళుగా సాలిడ్ బ్రేక్ లేని ఆయన ‘ఇస్మార్ట్ శంకర్’తో తనలోని పాత ఎనర్జీని ప్రేక్షకులకి చూపాలని భావిస్తున్నారు.

ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ అయితే చేసిన మొదటి రెండు సినిమాలు పెద్దవే అయినా చెప్పుకోదగిన బ్రేక్ రాకాపోవడంతో ఈ పూర్తిస్థాయి మాస్ ప్రాజెక్టులోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అలాగే నాభ నటేష్. మొదటి సినిమా మెప్పించినా కమర్షియల్ కథానాయకిగా స్థిరపడాలనే తన కోరికను ఈ చిత్రంతో నెరవేర్చుకోవాలని ఆశపడుతోంది. మరి వీరందరి ఆశల్ని జూలై 18న విడుదలకానున్న ఈ డబుల్ దిమాక్ సినిమా ఎంతవరకు నెరవేరుస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

X
More