‘సాక్ష్యం’లోని ఒక్క పాట కోసం 5గురు టాప్ సింగర్స్ !

Published on May 30, 2018 8:29 am IST

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాక్ష్యం’. శ్రీవాస్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామ నిర్మిస్తున్నారు. పంచభూతాలు అనే ఆసక్తికరమైన నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అని విధాలా గొప్పగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు మేకర్స్. ఈ సినిమాలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం దేశంలోనే ఉత్తమ గాయకులుగా పేరుగాంచిన 5గురు సింగర్స్ ను తీసుకున్నారట.

వాళ్ళు ఎస్పి బాలసుబ్రమణ్యం, ఏసుదాస్, హరిహరన్, కైలాష్ ఖేర్, బాంబే జయశ్రీ. ఈ ఐదుగురు కలిసి పంచభూతాలను గురించి వివరించే పాటను పాడనున్నారట. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం జూలై 20న భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :