ఇండస్ట్రీని షేక్ చేసిన “శ్రీమంతుడు” కి ఐదేళ్లు.!

ఇండస్ట్రీని షేక్ చేసిన “శ్రీమంతుడు” కి ఐదేళ్లు.!

Published on Aug 7, 2020 1:05 PM IST

ఒక స్టార్ హీరోకు సరైన హిట్ లేకుంటే వారి కంటే కూడా వారి అభిమానులే ఎక్కువగా సఫర్ అవుతారు. ఎంతగానో ఆరాధించే తమ అభిమానికి ఒక్క సరైన హిట్టు పడాలని ఎంత గానో కోరుకుంటారు. అలా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు ఒక సరైన హిట్టు పడాలి అని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్న సమయంలో వచ్చింది సరిగ్గా ఇదే రోజున ఐదేళ్ల కితం “శ్రీమంతుడు” సినిమా.

ఇక అంతే మహేష్ ఒక ఒక కం బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్ వస్తే బాక్సాఫీస్ మోత ఏ రేంజ్ లో ఉంటుందో మరో సారి నిరూపితం అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో నాన్ బాహుబలి రికార్డులను సెట్ చేసి మహేష్ కెరీర్ లో మరో బ్రేక్ ను ఇచ్చింది. అంతకు ముందు వచ్చిన “దూకుడు” తర్వాత మహేష్ స్టార్డంకు తగ్గ రేంజ్ హిట్ అందుకుంటారు అన్న ప్రతీసారీ అభిమానులకు నిరాశ తప్ప లేదు.

మెల్లగా కంటెంట్ కన్నా బాక్సాఫీస్ వసూళ్ల పరంగానే సినిమా రిజల్ట్ ను అంచనా వేసే రోజులు రావడంతో పలు ప్రయోగాలు కూడా బెడిసి కొట్టాయి. అప్పుడు ఒక స్ట్రాంగ్ కంటెంట్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సబ్జెక్టు తో కొరటాల శివ మహేష్ తో శ్రీమంతుడు చెయ్యడంతో మళ్ళీ మహేష్ గాడిన పడ్డారు. ఇక్క అక్కడ నుంచి ఒక్క సినిమా మినహా అన్ని వరుస విజయాలను అందుకొంటూ తన ఫ్యాన్స్ ను ఖుషీ చేసారు. ఇప్పుడు ఈ చిత్రం ఐదేళ్లు పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియాలో మహేష్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు