శివరాత్రికి మహేష్ బాబు మూవీ ఫస్ట్ లుక్.?

శివరాత్రికి మహేష్ బాబు మూవీ ఫస్ట్ లుక్.?

Published on Jan 12, 2015 1:34 PM IST

Mahesh-Babu-Koratala-Shiva

‘మిర్చి’ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన కొరటాల శివ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న ఓ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమై కంటిన్యూగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే పూణే, హైదరబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేసిన ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే పూర్ణ – మహేష్ లపై ఓ పాటని కూడా షూట్ చేసారు.

ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం ఫిబ్రవరిలో వచ్చే మహా శివరాత్రి కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకి శ్రీ మంతుడు అనే టైటిల్ నిపరిశీలిస్తున్నారు. ఈ చిత్ర టీం చెబుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కేవలం ఫ్యామిలీ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా మహేష్బాబు నుంచి అభిమానులు కోరుకునే యాక్షన్, కామెడీ కూడా సమపాళ్ళలో ఉండేలా కొరటాల శివ కథని రెడీ చేసారని సమాచారం. మహేష్ బాబు సరసన శృతి హాసన్ మొదటి సారి జోడీ కడుతోంది. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు