‘ప్లాప్’ల హీరో సినిమాకు భారీ బిజినెస్ !

Published on Mar 19, 2019 12:03 am IST

‘నేను శైలజ’ ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘చిత్రలహరి’. కాగా ఏప్రిల్ 12న విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇంకా మూడు వారాలు ఉండగానే.. అప్పుడే అన్ని ఏరియాల్లో బిజినెస్ పూర్తి చేసేసుకుంది.

థియేట్రికల్ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ఇంకా ప్రైమ్ వీడియో రైట్స్ తో పాటు శాటిలైట్ రైట్స్ ను కూడా కలుపుకుంటే.. దాదాపుగా ఈ చిత్రం 25 కోట్ల వరకు బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. వరుసగా ప్లాప్స్ లో ఉన్న హీరో సినిమాకు.. ఈ రేంజ్ బిజినెస్ జరగడం నిజంగా విశేషమే.

కాగా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సక్సెస్‌ ఫుల్‌ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై రూపొందిస్తున్నారు. సంచలన సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. సాయి ధరమ్ తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్శనితో పాటు మరో హీరోయిన్ నివేత పేతురాజ్ కూడా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More