
జూన్ చివరి నుంచీ కొనసాగుతున్న ‘బాహుబలి’ క్రేజ్ ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుతోంది. జూలై 10న రిలీజ్ అయిన ఈ సినిమా రెండవ వారం కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. సెకండ్ వీకెండ్ లో సూపర్ కలెక్షన్స్ సాధించిన బాహుబలి సెకండ్ వీక్ వీక్ డేస్ లో కూడా జోరుగానే ఉంది. బాక్స్ ఆఫీసు వద్ద స్ట్రాంగ్ గా ఉంది కానీ పబ్లిక్ లో మాట్లాడుకునే సినిమాల విషయంలో ఈ సినిమాపై ఉన్న ఫోకస్ కాస్త నెక్స్ట్ రానున్న బిగ్ ప్రాజెక్ట్ శ్రీమంతుడుపైకి షిఫ్ట్ అవుతోంది. సూపర్ స్టార్ మహేష్ అబూ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం ఘట్టమనేని అభిమానులు, మూవీ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
మహేష్ బాబు ఈ సినిమాలో ఎన్నారై గా కనిపించడమే కాకుండా, ఒక ఎపిసోడ్ లో కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపించనున్నాడు. కొరత శివ డైరెక్షన్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్న ఈ శ్రీమంతుడు సినిమాని మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని భారీ ఎత్తున ప్రమోట్ చెయ్యడానికి రంగం సిద్దం చేస్తున్నారు.