శైలజారెడ్డి అల్లుడు లో ఫోక్ సాంగ్ ?

శైలజారెడ్డి అల్లుడు లో ఫోక్ సాంగ్ ?

Published on Aug 14, 2018 4:00 PM IST

యువ సామ్రాట్ నాగ చైతన్య, అను ఇమ్మానుయేల్ జంటగా మారుతీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శైలజా రెడ్డి అల్లుడు’. షూటింగ్ ను పూర్తిచేసుకున్న ఈచిత్రం విడుదలకు సిద్దమవుతుంది. ఈచిత్రంలోని ‘అను బేబీ’ సాంగ్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఈ చిత్రంలోని రెండవ సాంగ్ ‘శైలజా రెడ్డి అల్లుడు చూడే’ ఆగస్టు 16న విడుదలకానుంది. ఈసాంగ్ ఫోక్ సాంగ్ నేపథ్యంలో ఉండనుందట అంతే కాకుండా ఈ పాటను తెలంగాణ జానపద గాయని మంగ్లీ తో పాడిస్తున్నారని సమాచారం.

తెలుగులో వరుస మ్యూజికల్ హిట్స్ తో దూసుకుపోతున్న మలయాళీ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం యొక్క ఆడియో విడుదల తేదీని ప్రకటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకులముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు