తలపతి 63 కోసం ఫుట్ బాల్ స్టేడియం సెట్ !

Published on Apr 8, 2019 8:29 pm IST

ఇళయదళపతి విజయ్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తలపతి 63′(వర్కింగ్ టైటిల్ ) కోసం చెన్నై లోని పరిసర పాంత్రంలో వున్నా ఈవీపి స్టూడియోస్ లో భారీ ఫుట్ బాల్ స్టేడియం సెట్ ను నిర్మిస్తున్నారు. సుమారు 50రోజులపాటు అక్కడే షూటింగ్ జరుపనున్నారు. ఈ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేషాలను చిత్రీకరించనున్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తుండగా ఆయనకు జోడిగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది.

భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళికి కానుకగా ఈచిత్రం విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :